VIDEO: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామికి భారీ హుండీ ఆదాయం

VIDEO: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామికి భారీ హుండీ ఆదాయం

కోనసీమలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. 90 రోజులకు గాను ఆలయ ప్రధాన హుండీలు ద్వారా రూ. 44,11,902 నగదు, 173 గ్రాములు వెండి, వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు లభించాయని ఈవో అల్లు దుర్గ భవాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.