అరండల్‌పేట లాడ్జిలో అగ్ని ప్రమాదం

GNTR: గుంటూరులోని అరండల్‌పేటలోని ఓ ప్రైవేట్ లాడ్జ్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. లాడ్జిలోని ఓ గదిలో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని లాడ్జి నిర్వాహకులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.