విద్యుత్ సమస్యలకు చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

RR: విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికతో వ్యవహరించాలని విద్యుత్ శాఖ అధికారులకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.వారు మాట్లాడుతూ.. మంజూరైన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ సామగ్రితో వెంటనే సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.