సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

SDPT: కోహెడ మండలం తీగల గుంటపల్లి గ్రామ పరిధిలోని సోమారంపల్లి గ్రామంలో ఎంపీ బండి సంజయ్ మంజూరు చేసిన రూ.15 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని సర్పంచ్ మ్యాకల స్వర్ణలత ప్రారంభించారు. గ్రామంలో మెరుగైన రవాణా సదుపాయం కల్పించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాగుల మహేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.