టీడీపీ నాయకులకు మెడికల్ కాలేజీలు కనపడటం లేదా?

E.G: గాల్లో మేడలు కట్టే కూటమి నాయకులకి నిజమైన భవంతులు కనపడటం లేదా అని జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ తోట నరసింహం సోమవారం ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి భూసేకరణ చేసి కోట్లు ఖర్చుపెట్టి 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించామన్నారు.