'అటవీ భూముల్లో బోరు బావులకు అనుమతులు ఇవ్వాలి'

KMM: అటవీ భూముల్లో బోరు బావులకు అనుమతులు ఇవ్వాలని గిరిజన సంఘం సభ్యులు బానోతు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం రఘునాథపాలెంలో నిర్వహించిన ప్రజావాణిలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి డేవిడ్ రాజుకి వినతి పత్రం అందజేశారు. బోరు, బావుల వల్ల ఉద్యాన పంటలు, వ్యవసాయ సాగుకు అనుకూలంగా ఉంటుందన్నారు. రైతు చేసుకున్న దరఖాస్తును గడువులోగా అనుమతులు ఇవ్వాలని కోరారు.