విద్యుత్ షాక్‌తో బాలిక మృతి

విద్యుత్ షాక్‌తో బాలిక మృతి

JGL: కొడిమ్యాల మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ క్రమంలో కొడిమ్యాలకు చెందిన మధుశ్రీ గుడికి వెళ్ళు మెట్లపై ఉన్నప్పుడు విద్యుత్ వైర్ తగిలి అపస్మారక స్థితికి వెళ్ళింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించగా, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు.