VIDEO: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు
MNCL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తుండటంతో మంచిర్యాలలో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు నినాదాలు చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుకు ఈ విజయం నిదర్శనమని అన్నారు.