VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతులు

WGL: యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యం పీఏసీఎస్‌ల వద్ద బారులు తీరుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించినా యూరియా అందక అవస్థలు పడుతున్నారు. నెక్కొండ మండలం సూరిపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం గురువారం రైతులు బారులు తీరారు. వ్యవసాయ పనులన్నీ పక్కనపెట్టి రోజంతా నిలబడినా ఒక్కబస్తా దొరకడం లభించడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.