VIRAL: యువ రైతు ఆలోచన.. జంతువుల నుంచి ఉపశమనం

అడవి పందుల నుంచి రైతులు తమ పంటను కాపాడుకోవడానికి ఓ యువ రైతు చక్కటి ఆలోచన చేశాడు. చెట్టుకు బ్యాటరీ లైట్ పెట్టి దాని ఎదురుగుండా రెండువైపులా అద్దం ఉండే గాజు పలకను గాలిలో వేలాడదీశాడు. అయితే బ్యాటరీ ఫోకస్ అద్దంపై పడగానే గాలికి తిరుగుతూ నాలుగు వైపులా లైట్ పడేలా చేస్తుంది. దీంతో పొలంలోకి జంతువులు రావడానికి భయపడుతాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు యువకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.