గురుకుల పాఠశాలని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్యెల్యే

SKLM: శ్రీకాకుళం మండలంలోని పెదపాడు పరిధిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల కళాశాల, పాఠశాలను మంగళవారం రాత్రి స్థానిక MLA గొండు శంకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వండిన భోజనాన్ని పరిశీలించి, మెస్ కమిటీతో భోజనం ఎలా ఉందో ఆరా తీశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటిస్తూ, భవిష్యత్‌లో అనుకున్న లక్ష్యం చేరుకోవాలని అన్నారు.