ఇసుక అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు

ఇసుక అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు

నిజామాబాద్: బోధన్ మండలం సిద్దాపూర్ మంజీరా నుండి ఇసుక పరిమిషన్ ఇవ్వడంతో ఒకే వేబిల్లుపై ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని బుధవారం బోధన్ రూరల్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వేబిల్లు చెక్ చేసిన తరువాతే ట్రాక్టర్లను వదులుతున్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యల్లో భాగంగానే తనిఖీలు చేస్తున్నట్లు కానిస్టేబుల్ నరేష్, రాములు తెలిపారు.