మహిళ అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

ADB: జైనూరు మండలం గూడమామడ గ్రామానికి చెందిన బూతింగే ఉర్మిళ(30) అనే మహిళ మూడు రోజులుగా కనిపించడం లేదు. ఈనెల 11న ఉదయం ఆటోలో జైనూర్ వైపు వెళ్లి ఆమె తిరిగి రాలేదని తల్లి కళాబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికైనా ఆమె ఆచూకీ తెలిస్తే వెంటనే జైనూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై రవికుమార్ కోరారు.