ఫ్లెక్సీ హోర్డింగ్‌ల వల్ల విద్యుత్‌కి అంతరాయం

KNR: జిల్లాలోని తెలంగాణ చౌక్ నుంచి కమాన్ వరకు ఉన్న ఫ్లెక్సీ హోర్డింగ్‌లతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు తెలిపారు. నగరంలో సోమవారం రాత్రి వీచిన ఈదుర గాలులతో ఫ్లెక్సీలు చిరిగి పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. హోర్డింగ్‌లను తీసివేయాలని స్థానికులు కోరుతున్నారు.