శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తివేత

NZB: గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లాలో వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో పర్యాటకులు సందడి చేస్తూ, సరదాగా గడుపుతున్నారు.