ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం
PDPL: ముత్తారం మండలంలోని హరిపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ సమత గురువారం ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.కొనుగోలు కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజు, రాజయ్య, సదానందం తదితరులు ఉన్నారు.