VOA ప్రమీలారాణి ఆత్మహత్యాయత్నం

ప్రకాశం: తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి చెందిన వివోఏ ప్రమీల రాణి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సీ కులం కావడంతో అర్హత లేదని సభ్యుల ముందు దుర్భాషలాడడం, విధుల నుంచి తప్పుకోవాలని ఏపీఎం ఒత్తిడి చేయడంతో ప్రమీల రాణి ఆదివారం ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సోమవారం ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.