లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు

NTR: అర్హులైన లబ్ధిదారులకు తప్పకుండా పెన్షన్ మంజూరు చేస్తామని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన కొంతమంది అర్హుల పెన్షన్లు పొరపాటున రద్దు అయిన విషయాన్ని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన వారికి ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.