కామారెడ్డి ఘటనపై కేటీఆర్ ఆగ్రహం
TG: కామారెడ్డిలో పంచాయతీ ఎన్నికల ఘర్షణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. పోలీసుల తీరు అమానవీయం అని, ప్రజలు తిరగబడే రోజు వస్తుందని గుర్తుచేశారు. ప్రభుత్వం దాడులకు పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించి అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.