నేడు పత్తి కొనుగోళ్లు బంద్
KMR: మద్నూర్ మండల కేంద్రంలో పత్తి కొనుగోళ్లను ఈరోజు బంద్ చేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లుల యజమానులు బుధవారం తెలిపారు. తెలంగాణ కాటన్ మిల్లులు, ట్రేడర్ల వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు పత్తి కొనుగోళ్లు నిలిపివేయనున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. సీసీఐ విధించిన కఠిన నిబంధనలను ఎత్తివేయాలని కోరారు. రైతులు పత్తిని తీసుకురావొద్దని వారు సూచించారు.