హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ ఎంపిక

హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ ఎంపిక

NRPT: జాజాపూర్ ఉపమండల కేంద్రంలో ఈనెల 26న హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ ఎంపిక చేశారు. నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా మ్యాడం ఆనంద్, ఉపాధ్యక్షుడిగా 6 గ్రామాల సర్పంచులు, ప్రధాన కార్యదర్శిగా గుడిసి నరసింహ, కోశాధికారిగా కొంగరి శ్రీనివాస్లను నియమించారు. సమ్మేళనంలో అధిక సంఖ్యలో హిందువులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.