బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

WGL: బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ.. వరంగల్ ఒకటో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అపర్ణాదేవి తీర్పునిచ్చారు. వివరాల్లోకెళ్తే పర్వతగిరి మండలం అన్నారం తండాకు చెందిన వాంకుడు చంద్రుడు, 2022 డిసెంబర్‌లో ఓ బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు.