రెడ్ క్రాస్ అవార్డుకు ఎంపికైన కలెక్టర్

W.G: మానవీయ సేవల్లో మెరుగైన పనితీరుకు గుర్తింపుగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచ రెడ్ క్రాస్, తలసీమియా దినోత్సవాల సందర్భంగా మే 8న విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాల్లో నిర్వహించనున్న కార్యక్రమంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్‌కి ఈ పురస్కారం ప్రధానం చేయనున్నారు.