VIDEO: 'జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరిస్తాం'

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని జగనన్న కాలనీలో మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ ఛైర్మన్‌ను కోరారు. స్పందించిన మున్సిపల్ ఛైర్మన్.. ఎమ్మెల్యే ఉగ్ర సహకారంతో త్వరలో రోడ్డు నిర్మిస్తామని, వీధిలైట్ల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.