వింజపల్లిలో అదనపు మక్కల కొనుగోలు కేంద్రం
SDPT: కోహెడ (M) వింజపల్లిలో అదనపు మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో మండల కాంగ్రెస్ నాయకులు ఆయనను కలిసి రైతుల ఇబ్బందులను వివరించారు. రామచంద్రాపూర్, ఎర్రగుంటపల్లె, గొట్లమిట్ట, నారాయణపూర్ తదితర గ్రామాల రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.