VIDEO: వేగం కన్నా ప్రాణం ముద్దు: ASP
MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద సోమవారం సాయంత్రం ASP మనన్ భట్ ఆధ్వర్యంలో "ARRIVE ALIVE" కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ASP మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. వేగం కన్నా ప్రాణం ముద్దని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.