సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ తప్పనిసరి: కమిషనర్
గుంటూరు: అపార్ట్మెంట్లు, లాడ్జ్‌లు, ఫంక్షన్ హాళ్లలోని సెప్టిక్ ట్యాంకులను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు తెలిపారు. క్లీనింగ్ చేసిన తరువాత మాత్రమే ఎన్వోసీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.