ఇరాన్ డ్రోన్ దాడులు.. స్పందించిన ఖతార్
ఇరాన్ డ్రోన్ దాడులపై ఖతార్ రక్షణశాఖ ప్రకటన విడుదల చేసింది. మెసాయిద్‌లోని పవర్ ప్లాంట్‌పై డ్రోన్ దాడి జరిగిందని వెల్లడించింది. ఖతార్ ఎనర్జీ సెంటర్‌పై మరో డ్రోన్ దాడి జరిగింది. అయితే ఈ రెండు ఘటనలలో ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. డ్రోన్ దాడుల వల్ల నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్పుకొచ్చింది. ప్రజలు వదంతులను నమ్మొద్దని సూచించింది.