'12 ఎకరాల్లో పత్తి పంట నష్టం.. పరిహారం అందించాలి'

'12 ఎకరాల్లో పత్తి పంట నష్టం.. పరిహారం అందించాలి'

SRD: కంగ్టి మండలం గాజులపాడు గ్రామంలో భారీ వర్షం దాటికి పత్తి పంట తీవ్రంగా నష్టం వాటిలిందని రైతులు బుధవారం వాపోయారు. స్థానిక వాగు పరిసర ప్రాంతాల్లో 12 ఎకరాల పత్తి పంట నీట మునిగి, పత్తి పైరు వేర్లు కుళ్లిపోయాయని రైతులు పండరి రావు, జంగం కసప్ప స్వామి, రక్మా పింకు బాయి, సంగయ్య స్వామి తెలిపారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని కోరారు.