ఐదేళ్ల నుంచి పరారీ.. ఒడిశాలో పట్టుకున్నారు

VSP: గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన గంజాయి అక్రమ రవాణా కేసులో ఐదేళ్లుగా పరారీలో ఉన్న వంతల సుందర్ రావు(23)ను శుక్రవారం అరెస్టు చేశామని ఎస్ఐ పి.రామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సుందర్‌ది అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నారు. 36 కిలోల గంజాయి రవాణా చేస్తూ, రెండు బైక్‌లను, గంజాయిని వదిలి పరారయ్యాడని తెలిపారు.