నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం బాణాల గ్రామంలో నూతన అంగన్వాడి కేంద్రం, గ్రామపంచాయతీ భవనానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బల్మూర్ మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.