'ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి'
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో MRO లక్ష్మీ రాజయ్యకు సోమవారం BJP మండల అధ్యక్షుడు విష్ణు యాదవ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విష్ణు యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చకపోతే BJP పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో BJP నేతలు ఉన్నారు.