ఎకో పార్కులో పక్షుల కేంద్రం
HYD: హిమాయత్‌సాగర్ వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎకో పార్కు నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంట్లో పక్షుల కేంద్రం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వివిధ రకాల పక్షులను ఇక్కడ సందర్శనకు ఉంచనున్నారు. దీనికోసం పార్కులో 6 ఎకరాలను కేటాయించారు. పక్షులపై అధ్యయనంతో పాటు, సందర్శకులకు ఆహ్లాదకరంగా ఇది మారుతుందని భావిస్తున్నారు.