సాంస్కృతిక సేనా ఉపాధ్యక్షుడిగా కొమ్ము ఆంజనేయులు

SRPT: తుంగతుర్తి మండలం రావులపల్లికి చెందిన కొమ్ము ఆంజనేయులు టీపీసీసీ సాంస్కృతిక సేనా మండల ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. శనివారం జిల్లా సాంస్కృతిక సేన అధ్యక్షుడు ఎర్ర అనుదీప్ నియామక పత్రాన్ని అందజేశారు. కళాకారుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే సామేలు, మాజీ మంత్రి దామోదర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.