రేపు విద్యా సంస్థలకు సెలవు : కలెక్టర్

రేపు విద్యా సంస్థలకు సెలవు : కలెక్టర్

ASR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని విద్యాసంస్థలకు ఈనెల 18వ తేదీ సోమవారం ఒకరోజు సెలవు ప్రకటించామని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదివారం తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు పాఠశాలలు మూసివేయాలని ఆదేశించారు. ఆదేశాలను పక్కాగా అమలు చేయాలన్నారు. విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.