నీటి సరఫరాపై జూలకల్లు గ్రామస్తుల వినతి

GDWL: వడ్డేపల్లి మండలం జూలకల్లు గ్రామంలో మిషన్ భగీరథ నీరు సరిగా సరఫరా కావడం లేదని గ్రామస్తులు వెంకటేశ్, శేఖర్, అశోక్, ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై శనివారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుని కలిసి వినతిపత్రం అందజేశారు. నీటి సరఫరా కేంద్రానికి తమ గ్రామం దూరంగా ఉండటం వల్ల, ఇతర గ్రామాల ట్యాంకులు నిండిన తర్వాతే తమకు నీళ్లు వస్తున్నాయన్నారు.