VIDEO: ప్రొద్దుటూరు రోడ్డు మీద నిలిచిన వర్షం నీరు..!

KDP: ప్రొద్దుటూరులో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మైదుకూరు రోడ్డు Y జంక్షన్ వద్ద సుమారు 100 మీటర్ల మేర రోడ్డు మీద వర్షపు నీరు నిలబడింది. దీంతో అటువైపు వెళ్లే పాదచారులు నడవడానికి వీలులేకుండా రోడ్డు మీద నీరు పారుతోంది. దీని వల్ల వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే డ్రైనేజ్ నిండి నీరు రోడ్ల మీదకు వస్తుండటంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.