'పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశాం'

MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశామని కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు వార్డులలో వరద నీరు నిలిచింది. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో కమిషనర్ మంగళవారం వివిధ వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకున్నారు.