మధ్యతరగతికి దూరంగా.. మహానగరం

మధ్యతరగతికి దూరంగా.. మహానగరం

HYD‌లో భూములకు ఊహించని విధంగా ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ORR పరిధిలో భూముల రేట్లు ఆకాశాన్నంటుతుండటంతో, మధ్యతరగతి వారు సొంత ఇల్లు కల దూరమవుతోంది. కోకాపేటలో భూముల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కొన్నేళ్ల క్రితం రూ. 20 లక్షల హోమ్‌లోన్ లభించే 2BHK ఇల్లు ఇప్పుడు రూ.90 లక్షలకు కూడా దొరకడం కష్టంగా మారింది. దీంతో నెలకు లక్ష సంపాదించే ఉద్యోగికైనా ఇల్లు కొనడం అసాధ్యమవుతోంది.