కర్నూలు, నంద్యాలలో మూడు రోజులు వర్ష సూచన
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రానున్న మూడు రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆకస్మిక వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని హెచ్చరించింది.