నేడు జిల్లాకు రానున్న వైఎస్ షర్మిల

నేడు జిల్లాకు రానున్న వైఎస్ షర్మిల

కడప జిల్లాకు శనివారం పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రానున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు విజయ జ్యోతి తెలిపారు. ఉపాధి హామీ పరిరక్షణలో భాగంగా కడపలోని యానాదికాలనీలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు ఈ విషయాన్ని గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.