యువకుడు దారుణ హత్య
GDWL: ధరూర్ మండలంలోని గుడ్డెందొడ్డి గ్రామంలో సుధాకర్ (25) అనే యువకుడిని సోమవారం అర్ధరాత్రి సమయంలో హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.