అసెంబ్లీ సమన్వయకర్తగా సూర్యనారాయణ

VZM: రాష్ట్రంలో వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు విజయనగరం, రాజాం నియోజకవర్గానికి కె.వి.వి సూర్యనారాయణ రాజు(పులి రాజు)ను నియమించినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన చీపురుపల్లి నియోజకవర్గం కెల్ల గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.