'పీకేవోసీ డిప్ సైడ్ గనిని సింగరేణికే కేటాయించాలి'
BDK: సింగరేణి పరిరక్షణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మణుగూరు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పీకేవోసీ ఆవరణలో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. పీకేవోసీ డిప్ సైడ్ గనిని సింగరేణికే కేటాయించాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇన్‌ఛార్జ్ మేనేజర్ వి.అప్పారావుకు పలు డిమాండ్లతో వినతిపత్రం అందించారు.