రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కృష్ణా: చోడవరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరి పంటలను ఆయన పరిశీలించారు. రైతులు ఆహార పంటలతో పాటుగా వాణిజ్య పంటలను కూడా పండించినట్లయితే అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.