హాస్టల్ వార్డెన్‌లతో ఎమ్మెల్యే సమావేశం

సత్యసాయి: మడకశిరలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం హాస్టల్ వార్డెన్‌లతో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన భోజనం, వసతి అందించాలన్నారు. అలాగే వార్డెన్లు పేదవారి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.