రోడ్డు మంజూరు చేయండి: మల్లేషం

రోడ్డు మంజూరు చేయండి: మల్లేషం

MDK: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావును దొంగల ధర్మారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మాసాయిపేట మల్లేషం కలిశారు. నిజాంపేటలో ఎమ్మెల్యేను కలిసిన మల్లేషం.. నందిగామ నుంచి వయా బచ్చరాజ్ పల్లి, ధర్మారం, చిట్టోజిపల్లి మీదుగా చేగుండా వరకు 19 కిలోమీటర్ల డబుల్ రోడ్డును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు సానుకూలంగా స్పందించారు.