సచివాలయంలో కలెక్టర్ తనిఖీలు
BPT: భట్టిప్రోలు మండలం గోరిగపూడి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ వీ. వినోద్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. సిబ్బంది హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను సకాలంలో, పారదర్శకంగా అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.