బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్

ఏలూరు: శ్రీ దయానంద సరస్వతి సేవా ఆశ్రమం బాలికల వసతి గృహంలో 8వ తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు శశి కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. శశి కుమార్‌కు సహకరించిన అతని భార్య, ఆశ్రమ నిర్వాహకురాలు ఫణీ శ్రీ, అతని మేనకోడులు కేర్ టేకర్ లావణ్యలను కూడా నిందితులుగా గుర్తించి, ఏలూరు 2టౌన్ పోలీసులు అరెస్ట్ చేశామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.