'దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టండి'

MBNR: జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలలో రోడ్లు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయని, ఆ రోడ్లకు వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టాలని పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు నగర పురపాలక కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ తాటి గణేష్ పాల్గొన్నారు.